బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు..

by  |
బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు..
X

దిశ, ఏపీ బ్యూరో: బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు దక్కింది. జియోగ్రాఫికల్ గుర్తింపు లభించిన బొబ్బిలి వీణకు తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. తపాలా శాఖ బొబ్బిలి వీణపై ప్రత్యేక తపాలా చంద్రిక విడుదలైంది. విజయనగరం జిల్లా బొబ్బిలిలో మంగళవారం ఈ ప్రత్యేక తపాలా చంద్రికను డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, బొబ్బిలి ఎమ్మెల్యే శంభంగి వెంకట చిన అప్పలనాయుడు, విశాఖపట్నం రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ముత్యాల వెంకటేశ్వర్లులు ఆవిష్కరించారు.

veena

ఇకపోతే బొబ్బిలి వీణకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతేకాదు నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ బొబ్బిలి వీణను చూసి మురిసి, అవి తయారు చేసే సర్వ సిద్ధి వెంకటరమణను వైట్ హౌస్‌కు ఆహ్వానించారట. ఇక ఇక్కడ తయారైన వీణలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. మైసూర్, తంజావురు వీణలు 3 చెక్కలతో తయారు చేస్తే.. బొబ్బిలి వడ్రంగులు ఒకే చెక్కతో అంటే ఏకాండీ కొయ్యతో వీణలు తయారు చేయడంలో సిద్ధహస్తులు. ఇకపోతే ఇటీవలే తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం పూత రేకులపై ప్రత్యేకంగా రూపొందించిన పోస్టల్ కవర్‌ను తపాలాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed