ముంబైలో వెయ్యి పడకల కొవిడ్ ఆస్పత్రి

by  |
ముంబైలో వెయ్యి పడకల కొవిడ్ ఆస్పత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదు అవుతున్నాయి. అందులో ముఖ్యంగా రాజధాని ముంబైలో వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కొవిడ్ నివారణ కోసం చర్యలు ముమ్మరం చేసింది. ముంబైలోని బైకుల్లా నియోజకవర్గం రిచర్డ్సన్ & క్రుదాస్ (ఇంజనీరింగ్ కంపెనీ) ప్రాంగణంలో 1000 పడకలతో ప్రత్యేక కొవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తోంది. ఈ వెయ్యి పడకల ఆస్పత్రిలో 300 బెడ్‌లను ఐసీయూ, ఆక్సిజన్ సరఫరా, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ నెల చివరి నాటికల్లా ఆస్పత్రిలో సేవలు ప్రారంభమవుతాయని బీఎంసీ స్పష్టం చేసింది.

Next Story