Vettaiyan OTT: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హిట్ ‘వేట్టయాన్’..

by Mallepaka Hamsa |   (  Updated:2024-11-03 14:24:40  IST  )

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth), టీజే జ్ఞానవేల్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘వేట్టయాన్’.

Vettaiyan OTT:  ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హిట్ ‘వేట్టయాన్’..
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth), టీజే జ్ఞానవేల్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘వేట్టయాన్’. అయితే ఇందులో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్ వంటి స్టార్స్ కీలక పాత్రలో కనిపించారు. ‘వేట్టయాన్’(Vettaiyan) భారీ అంచనాల మధ్య అక్టోబర్ 10న థియేటర్స్‌లో విడుదలై సూపర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్స్ వసూలు చేయడంతో పాటు సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తాజాగా, వేట్టయాన్(Vettaiyan) విడుదలైన నెల రోజులకు డిజిటల్ స్ట్రీమింగ్‌(Digital Streaming)కు సిద్ధమైంది. ఈ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) సొంతం చేసుకోగా నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్(streaming) అందుబాటులోకి రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ‘X’ ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేస్తూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించారు.

Next Story