రేపు చలో జనగామ

56

దిశ,వెబ్‌డెస్క్: రేపు చలో జనగామకు బీజేపీ పార్టీ పిలుపునిచ్చింది. జనగామ బీజేపీ అధ్యక్షుడు పవన్ శర్మపై లాఠీ చార్జ్‌కు నిరసనగా బీజేపీ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. సీఐ మల్లేశ్ పై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ డెడ్ లైన్ విధించారు. లేదంటే డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సంజయ్ వెల్లడించారు. కాగా జనగామ మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళవారం బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు పవన్ శర్మపై సీఐ మల్లేశ్ లాఠీ చార్జీ చేసిన సంగతి తెలిసిందే.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..