వైసీపీ టార్గెట్ కొన్ని థియేటర్లే.. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

by  |
వైసీపీ టార్గెట్ కొన్ని థియేటర్లే.. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వర్సెస్ సినీ ఇండస్ట్రీగా రాజకీయం మారిపోయింది. సినిమా టికెట్ల ధరల విషయంలో సినీ ఇండస్ట్రీకి జగన్ సర్కార్‌కి మధ్య వార్ నడుస్తోంది. ఈ వార్‌పై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగం విషయంలో ఏపీ ప్రభుత్వం అనవసర జోక్యం చేసుకుంటుందని ఆయన అన్నారు. విజయవాడలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మాధవ్‌ మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వం కొన్ని థియేటర్లను టార్గెట్ చేసుకుని అందరినీ ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన ఆరోపించారు. సినిమా రంగంపై ఎందుకంత వివక్ష అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరితో సినీ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించే ఆలోచన చేయకుండా సినిమా రంగానికి చెందిన టికెట్ల ధరలపై పట్టుబట్టుకుని కూర్చోవడం సరికాదన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందని విమర్శించారు.

స్థిరాస్తి వ్యాపారులను బెదిరించేలా ప్రభుత్వం ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఈనెల 28న ప్రజాగ్రహ సభ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సభకు బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్‌ జవదేకర్ హాజరవుతారని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వైసీపీ బాధితులను ఆహ్వానించినట్లు ఎమ్మెల్సీ మాధవ్ స్పష్టం చేశారు.



Next Story

Most Viewed