ఉద్యోగాలు భర్తీ చేయడంలో కేసీఆర్ విఫలం: జ్ఞానేంద్ర ప్రసాద్

by  |
ఉద్యోగాలు భర్తీ చేయడంలో కేసీఆర్ విఫలం: జ్ఞానేంద్ర ప్రసాద్
X

దిశ, మియాపూర్: ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షకు బీజేపీ ప్రముఖులు, నేతలతో కలసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడంలో, నిరుద్యోగ భృతి హామీ అమలులో ఘోరంగా విఫలమైందని అన్నారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వాపోయారు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో యువత ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరం అని అన్నారు. ఉద్యమ ఆకాంక్షలు నీరు గార్చిన నియంతృత్వ కేసీఆర్ సర్కారుకు బుద్ది చెప్పేందుకు రాష్ట్రంలో బీజేపీ, బీజేవైఎం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed