- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాళ్లకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది: బండి సంజయ్
<p>దిశ, వెబ్‌డెస్క్: పోలీసులతో పాలన చేయాలనుకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, చరిత్రలో అందుకు చాలా ఉదాహరణలున్నాయని బీజేపీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. రాముడితో పెట్టుకున్న ములాయం సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్‌కు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందని సంజయ్ కుమార్ ఆరోపించారు. బీజేపీ నేతల ఇళ్లు, వాహనాలపై దాడి చేసిన టీఆర్ఎస్ పార్టీ వారిని అరెస్ట్ చేసి ఎందుకు జైళ్లో పెట్టడం లేదని ప్రశ్నించారు. అక్రమ అరెస్ట్‌లకు బీజేపీ కార్యకర్తలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పోలీసులతో పాలన చేయాలనుకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, చరిత్రలో అందుకు చాలా ఉదాహరణలున్నాయని బీజేపీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. రాముడితో పెట్టుకున్న ములాయం సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్‌కు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందని సంజయ్ కుమార్ ఆరోపించారు. బీజేపీ నేతల ఇళ్లు, వాహనాలపై దాడి చేసిన టీఆర్ఎస్ పార్టీ వారిని అరెస్ట్ చేసి ఎందుకు జైళ్లో పెట్టడం లేదని ప్రశ్నించారు. అక్రమ అరెస్ట్‌లకు బీజేపీ కార్యకర్తలు బెదిరే ప్రసక్తే లేదని, శ్రీరాముడిని కించపరిచిన మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేదంటేనే కేసీఆర్‌కు హిందూత్వంపై ఎంత గౌరవం ఉందో అర్థమవుతోందన్నారు. పోలీసులతో రాష్ట్రాన్ని నడపాలనుకుంటే పశ్చిమబెంగాల్‌లో ఏం జరిగిందో అందరికీ తెలుసునని సంజయ్ మండిపడ్డారు.
Next Story






