ఆరుపదుల్లోకి అడుగుపెట్టిన ‘వెంకీ మామ’

by  |
ఆరుపదుల్లోకి అడుగుపెట్టిన ‘వెంకీ మామ’
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘ఇమేజ్’ ఛట్రంలో ఇరుక్కోకుండా అన్ని పాత్రలను, జోనర్‌లను టచ్ చేసిన నటుడు విక్టరీ వెంకటేశ్. ప్రతి సినిమాకు వైవిధ్యాన్ని చూపించే వెంకీ.. తను ఎంచుకున్న పాత్రకు 100 శాతం న్యాయం చేసి పరిపూర్ణ నటుడని అనిపించుకున్నాడు. ఈ క్రమంలో అనేక విజయాలు సాధించి ‘విక్టరీ’నే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. ప్రస్తుతం నారప్ప సినిమాతో బిజీగా ఉన్న వెంకీ నేడు ఆరుపదుల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా సెలెబ్రిటీలు, శ్రేయోభిలాషులు విషెస్ అందిస్తున్నారు.

‘ప్రియమైన వెంకీమామకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎంతో సరదాగా ఉండే నిన్ను చూసి నేనెప్పుడూ ఆనందిస్తాను. ‘నారప్ప’ లుక్ ఎంతో బాగుంది. స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించగలదని భావిస్తున్నా. నీకు ఈ ఏడాది అంతా మంచే జరగాలని, మంచి మెమొరబుల్ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా’ – చిరంజీవి

‘సూపర్ కూల్ వెంకీ మామకు హ్యాపీ బర్త్‌డే. మీరు ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నా’ – మహేశ్ బాబు

‘హ్యపీ బర్త్‌డే వెంకీ మామ. మంచి మనసున్న మీరు.. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. త్వరలోనే కలుస్తాను కోబ్రా’ – వరుణ్ తేజ్

‘స్వీటెస్ట్, మోస్ట్ పాజిటివ్ పర్సన్ వెంకీ మామకు బర్త్‌డే శుభాకాంక్షలు’ – లావణ్య త్రిపాఠి

‘ఎప్పుడూ సరదాగా ఉండే వెంకటేశ్‌ గారికి హ్యాపీ బర్త్‌డే. ఈ ఏడాది మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’ – హరీష్ శంకర్

‘నా హీరో, నా స్నేహితుడు, నా సెంటీ హాఫ్ అన్నీ వెంకీనే. నీ బర్త్‌డే సందర్భంగా నీకు టన్నుల ప్రేమను బహుమానంగా పంపిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ మై డియర్’ – ఖుష్బు

‘వెంకీ ఉంటే నిరాశ మన దరిచేరదు. నీరసం దరిదాపుల్లో కనిపించదు. ఆయనతో ప్రయాణం చాలా ఫన్‌గా, పాజిటివ్‌గా ఉంటుంది. హ్యాపీ బర్త్‌డే వెంకీ. మరోసారి రాక్ చేద్దాం’ – అనిల్ రావిపూడి

రవితేజ, రామ్, రకుల్‌ప్రీత్ సింగ్, నాని, నిఖిల్, సుధీర్ బాబు, గోపిచంద్ మలినేని, బాబీతో పాటు మరెంతో మంది సెలెబ్రిటీలు వెంకీమామకు బర్త్‌డే విషెస్ అందించారు.


Next Story

Most Viewed