బిగ్ బాస్ సీజన్-9 ఫినాలేకు గెస్టుగా రాబోతున్న పాన్ ఇండియా స్టార్ హీరో..? ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్..!

by I. Sairam |

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9(Bigg Boss-9) ఎట్టకేలకు గ్రాండ్ ఫైనల్‌కు వచ్చేసింది.

బిగ్ బాస్ సీజన్-9 ఫినాలేకు గెస్టుగా రాబోతున్న పాన్ ఇండియా స్టార్ హీరో..? ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9(Bigg Boss-9) ఎట్టకేలకు గ్రాండ్ ఫైనల్‌కు వచ్చేసింది. దాదాపు 15 వారాల సుదీర్ఘ ప్రయాణంలో గొడవలు, భావోద్వేగాలు, టాస్క్‌లతో బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం హౌస్‌లో తనూజ, కళ్యాణ్ పడాల, డిమోన్ పవన్, ఇమ్మానుయేల్, సంజన టాప్-5 కంటెస్టెంట్లుగా నిలిచారు. ఈ ఆదివారం జరగనున్న గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో ఓటింగ్ రేసు అత్యంత ఉత్కంఠగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్‌ 9 విజేత ఎవరు? చివరి వారం ఓటింగ్ ఎలా సాగుతోంది? అనేది హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం బిగ్‌బాస్ ఆ ఫైవ్ కంటెస్టెంట్‌ల జర్నీ వీడియోలు చూపిస్తూ హౌస్‌మేట్స్‌ను భావోద్వేగానికి గురిచేస్తున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే ఇమ్మాన్యుయేల్, తనూజ, డెమోన్ పవన్ తమ జర్నీలను చూసుకున్నారు. ఇక ఈ రోజు ఏపిసోడ్‌లో పవన్ కళ్యాణ్ పడాల, సంజన జర్నీను చూపించనున్నారు. ఇదిలా ఉంటే.. ప్రతి సీజన్‌కు ఓ బిగ్ సెలబ్రెటీని పిలిచి విన్నర్‌ను అనౌన్స్ చేయడం ఆనవాయితీగా వస్తుంది. కాగా ఈసారి కూడా బిగ్ సెలబ్రిటీ బిగ్ బాస్ ఫైనల్‌కు గెస్ట్‌గా రానున్నాడని తెలుస్తుంది.

అతను మరెవరో కాదు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas). అతన్ని సీజన్ 9 ఫినాలేకు గెస్ట్‌గా పిలవాలని టీమ్ నిర్ణయించారట. అయితే జనవరి 9న రాజా సాబ్ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగానే ప్రభాస్‌ను బిగ్ బాస్ ఫినాలేకు గెస్ట్‌గా పిలిచారని తెలుస్తుంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Next Story