ఇమ్ము ఎలిమినేషన్ పై గెటప్ శ్రీను, రోషిణి అసహనం.. ఎంటర్టైనర్స్ ఉన్నది అందుకేనా అంటూ పోస్టులు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-21 21:17:24  IST  )

హౌస్ లో 105 రోజులు ఉన్న ఇమ్మాన్యుయేల్.. నవ్వించి, ఏడిపించి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు.

ఇమ్ము ఎలిమినేషన్ పై గెటప్ శ్రీను, రోషిణి అసహనం.. ఎంటర్టైనర్స్ ఉన్నది అందుకేనా అంటూ పోస్టులు
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసింది. తొలిసారి కామనర్, అదికూడా ఇండియన్ ఆర్మీ సోల్జర్ టైటిల్ విన్నర్ గా నిలవడంతో కామన్ మ్యాన్స్ అంతా ఇది తమ విజయంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ మరోవైపు ఇమ్మాన్యుయేల్ అభిమానులు, తోటి నటీనటులు అతని ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అంటూ ఫైరవుతున్నారు.

హౌస్ లో 105 రోజులు ఉన్న ఇమ్మాన్యుయేల్.. నవ్వించి, ఏడిపించి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. టాస్కులు ఆడలేదా అంటే కాదు, కన్నింగ్ గేమ్ ఆడాడా అంటే అంతకన్నా కాదు. సంజనతో తల్లి బాండ్, మరోవైపు తనూజతో బెస్ట్ ఫ్రెండ్ బాండ్ ఉన్నా ఏ రోజూ దానిని గేమ్ గా చూపించలేదు. జెన్యూన్ గా ఆడినవారికి గెలుపు రాదని మరోసారి ప్రూవ్ అయిందంటూ ఇమ్మూ అభిమానులంతా తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అతను ఏం తక్కువ చేశాడని టాప్ 4 ప్లేస్ లో పడేశారని బిగ్ బాస్ ను తిడుతున్నారు. నిజంగా ఈ షోను డైలీ చూసినవారికి అతని ఆటతీరు ఏంటో, మిగతా వాళ్లు ఎలా ఆడారో, ఎవరికి విన్నరయ్యే అర్హత ఉందో తెలుస్తుందంటున్నారు.

ఇమ్మాన్యుయేల్ ఎలిమినేషన్ పై జబర్దస్త్ రోషిణి, గెటప్ శ్రీను తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇమ్ము ఎలిమినేషన్ తనను చాలా డీప్ గా హర్ట్ చేసిందని, చాలా నిరాశకు గురయ్యానని గెటప్ శ్రీను ఇన్ స్టా స్టోరీలో పేర్కొన్నాడు. 4వ స్థానంలో అతను హౌస్ నుంచి బయటికి రావడం తట్టుకోలేకపోయానన్నాడు. ప్రతీ టాస్క్ ఎంతో హానెస్ట్ గా ఆడాడని, కమెడియన్ గా హౌస్ లోకి అడుగుపెట్టినా హీరోగా నిలిచాడన్నాడు.

ఇక రోషిణి ఇమ్ము ఎలిమినేషన్ పై తీవ్రంగా స్పందించిది. చాలా నిరాశ చెందానని, కష్టపడినవారికి వాల్యూ ఉండదు, అందుకు తగిన ఫలితం రాదని మరోసారి రుజువైందని పేర్కొంది. ఎంటర్టైనర్స్ ఉన్నది ఎంటర్టైన్ చేయడానికి మాత్రమేనని బిగ్ బాస్ నిరూపించిందని వాపోయింది. ఎలిమినేట్ అయినా..రియల్ విన్నర్ మాత్రం ఇమ్మాన్యుయేలే అని పేర్కొంది. ఎవరేమనుకున్నా.. ఇమ్మును చూసి గర్వపడుతున్నానని రోషిణి ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది.

Next Story