- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విన్నర్ ప్రైజ్ మనీ, రెమ్యూనరేషన్ తో కల్యాణ్ ఎంత సంపాదించాడో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కామన్ మ్యాన్ ను ప్రేక్షక లోకం విజేతగా నిలబెట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కామన్ మ్యాన్ ను ప్రేక్షక లోకం విజేతగా నిలబెట్టింది. ఇండియన్ ఆర్మీ నుంచి బిగ్ బాస్ కు వచ్చిన కల్యాణ్ ను ఆడియన్స్ ఓట్లతో గెలిపించారు. అమ్మాయిల పిచ్చోడని ముద్ర పడినా.. పడిలేచిన కెరటంలా కల్యాణ్ తన మైండ్ గేమ్ తో బీబీ హౌస్ లో టాప్ కంటెస్టంట్స్ లో నిలిచాడు. తనూజతో పులిహోర కలపడంతో అతని ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా తనూజ అవేం పట్టించుకోకుండా కల్యాణ్ కు ఒక వెల్ విషర్ గా సపోర్ట్ ఇచ్చింది. అనేకసార్లు నామినేషన్లలో ఉన్న కల్యాణ్.. టాస్కుల్లో తన అంగబలాన్ని చూపించాడు.
మరి బిగ్ బాస్ హౌస్ లో అతనెంత పారితోషికం అందుకున్నాడో తెలుసా? 15 వారాలు.. అంటే 105 రోజులు హౌస్ లో ఉన్న కల్యాణ్ కు బీబీ టీమ్ వారానికి రూ.70 వేలు చొప్పున రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. కామనర్స్ అందరికీ ఇదే రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన అతనికి 15 వారాలకు గాను రూ.10,50,000 పారితోషికం అందినట్లవుతుంది. ప్రైజ్ మనీ రూ.35 లక్షలు, స్పాన్సర్ ప్రైజ్ మనీ రూ.5 లక్షలు, రెమ్యూనరేషన్ కలిపి.. కల్యాణ్ రూ.50,50,000 సంపాదించాడని తెలుస్తోంది. ఏదేమైనా కామనర్ గా విన్ అయిన అతనికి ఇది చాలా పెద్ద అమౌంట్ అనే చెప్పాలి.






