సూట్ కేస్ + రెమ్యూనరేషన్.. యోధుడిగా జాక్ పాట్ కొట్టిన డిమోన్ పవన్

by Naga Rani Yarlagadda |

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే అనేక ట్విస్టులతో ముగిసింది.

సూట్ కేస్ + రెమ్యూనరేషన్.. యోధుడిగా జాక్ పాట్ కొట్టిన డిమోన్ పవన్
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే అనేక ట్విస్టులతో ముగిసింది. ఇమ్ము లేదా తనూజ విన్నరనుకున్నవారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. డిమోన్ పవన్ విషయంలో మాత్రం ప్రేక్షకుల అంచనాలతో కాస్త అటూ ఇటుగా అనుకున్నట్లే జరిగింది. టాప్ 3లో ఉన్న అతను.. మాస్ హీరో రవితేజ ఇచ్చిన రూ.15 లక్షల ఆఫర్ తీసుకుని తనంతట తానే బయటికి వచ్చాడు. యోధుడిగా బయటికి వచ్చిన అతడిని నెటిజన్లు ఆకాశానికెత్తేస్తున్నారు. ఫ్యామిలీ కోసం రైట్ టైమ్ లో రైట్ డెసిషన్ తీసుకున్నాడని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఆ ఆఫర్ తీసుకోకపోయి ఉంటే.. పవన్ కేవలం రెమ్యూనరేషన్ తో సరిపెట్టుకోవలసి వచ్చేది. ఇంతకీ పవన్ 15 వారాలు హౌస్ లో ఉండి ఎంత సంపాదించాడో, సూట్ కేస్ అమౌంట్, పారితోషికం కలిపి ఎంత వెనుకేశాడో తెలుసా?

కామనర్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టినవారికి డిమోన్ పవన్ ఒకడు. రెండుసార్లు కెప్టెన్ అయిన అతను.. టాస్కుల బాహుబలిగా పేరు తెచ్చుకున్నాడు. ఒకానొక టైమ్ లో రీతూతో రిలేషన్ గురించి విమర్శలు వచ్చాయి. అయినా అవేమీ పట్టించుకోలేదు. గతవారం డబుల్ ఎలిమినేషన్లో ఆమె బయటికి వెళ్లిపోయాక.. పవన్ అసలు గేమ్ చూూపించాడు. పంచ్ లు వేసి కామెడీ చేస్తూనే గేమ్ పై ఫోకస్ పెంచాడు. ఇదేదో ముందు నుంచీ ఉండి ఉంటే.. అతను కూడా విన్నింగ్ మెటీరియల్ గా మారేవాడంటూ నెటిజన్లు అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు.

ఇక పవన్ రెమ్యూనరేషన్ విషయానికొస్తే.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన కామనర్స్ కు ఒకేరకంగా పారితోషికం ఇచ్చారు. పవన్ కు వారానికి రూ.70 వేలు ఇచ్చేలా డీల్ కుదరగా.. ఓవరాల్ గా 15 వారాలకు అతను రూ.10.50 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. సూట్ కేస్ తో మరో రూ.15 లక్షలు తీసుకున్న పవన్ మొత్తంగా రూ.25,50,000 సంపాదించాడన్నమాట.

Next Story