బిగ్ బాస్‌లో దుమారం.. హోస్ట్‌తోనే గొడవ దిగిన కంటెస్టెంట్

by Sujitha Rachapalli |

బిగ్ బాస్‌లో దుమారం రేగింది. ఏకంగా హోస్ట్‌తోనే గొడవకు దిగాడు కంటెస్టెంట్. అలా ఎలా చెప్తావ్ అంటూ వాదించాడు. బిగ్ బాస్ సీజన్‌ 9లోనే ఈ ఘటన జరగ్గా ఇందుకు సంబంధించిన ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బిగ్ బాస్‌లో దుమారం.. హోస్ట్‌తోనే గొడవ దిగిన కంటెస్టెంట్
X

దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్‌లో దుమారం రేగింది. ఏకంగా హోస్ట్‌తోనే గొడవకు దిగాడు కంటెస్టెంట్. అలా ఎలా చెప్తావ్ అంటూ వాదించాడు. బిగ్ బాస్ సీజన్‌ 9లోనే ఈ ఘటన జరగ్గా ఇందుకు సంబంధించిన ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9 హోస్ట్‌గా ఇన్నాళ్లు కమల్ హాసన్ వ్యవహరించేది. కానీ ఈ సారి విజయ్ సేతుపతి హోస్ట్‌గా చేస్తున్నాడు. తప్పు చేసిన కంటెస్టెంట్స్‌కు గట్టిగానే ఇచ్చిపడేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ టాస్క్‌లో సీరియల్ యాక్ట్రెస్ సాంద్రా.. స్టాండప్ కమెడియన్ విక్కల్స్ విక్రమ్‌ను చూపిస్తూ అనుచితంగా సంకేతం చేసింది. ఈ విషయం ప్రేక్షకుల ఆగ్రహానికి కూడా కారణమైంది. కాగా సాంద్రా, ఆమె భర్త ప్రాజిన్ ఈ వాదనలో విక్రమ్‌ను టార్గెట్ చేశారు. పర్ఫార్మెన్స్, ఎమోషనల్ గేమ్ ప్లే గురించి మాట్లాడారు. కాగా ఇందుకు సంబంధించిన విషయంలో ప్రాజిన్ భార్యను డిఫెండ్ చేస్తూ హోస్ట్‌ మీద అరిచాడు. ప్రతిసారి ఇంటరప్ట్ చేస్తూ.. అగౌరవ పరిచాడు.

Next Story