- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bigg Boss-9: సెకండ్ ఫైనలిస్ట్ కన్ఫర్మ్.. టాస్క్‌లో తీవ్రంగా గాయపడ్డ ఆ కంటెస్టెంట్ లక్ కలిసొచ్చేనా?
బిగ్ బాస్ సీజన్-9(Bigg Boss-9) ఎట్టకేలకు ఫైనల్‌కు వచ్చేసింది. దీంతో బిగ్ బాస్.. షోను మరింత రసవత్తరంగా మార్చేందుకు వివిధ గేమ్స్ పెడుతున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్-9(Bigg Boss-9) ఎట్టకేలకు ఫైనల్‌కు వచ్చేసింది. దీంతో బిగ్ బాస్.. షోను మరింత రసవత్తరంగా మార్చేందుకు వివిధ గేమ్స్ పెడుతున్నాడు. దీంతో ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠత నెలకొన్నది. ప్రస్తుతం హౌస్‌లో కళ్యాణ్ పడాల(Kalyan Padala), సుమన్ శెట్టి(Suman Shetty), సంజన(Sanjana), తనూజ(Tanuja), ఇమ్మాన్యుయేల్(Emmanuel), భరణి(Bharani), డీమన్ పవన్(Demon Pawan) మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలి ఉన్నారు. ఇప్పటికే మొదటి ఫైనలిస్ట్‌గా కళ్యాణ్ పడాల నిలవగా.. రెండో ఫైనలిస్ట్ కోసం టాస్క్‌లు కొనసాగుతున్నాయి.
ఇందులో భాగంగా తనకు ఇచ్చిన ప్రతి టాస్కులోనూ అద్భుతంగా ఆడుతూ ముందుకు వెళ్తున్నారు కమెడియన్ ఇమ్మాన్యుయేల్. అందరినీ వెనక్కు నెడుతూ మెజారిటీ గేమ్స్‌లో పై చేయి సాధించాడు. అందుకే ఇప్పుడు సెకండ్ టికెట్ టు ఫినాలే రేసులోనూ ధృడంగా నిలబడ్డాడు. కానీ తాజాగా రిలీజ్ అయిన ఏపిసోడ్‌లో మాత్రం కాస్త డల్‌గా కనిపించాడు. సెకెండ్ ఫైనలిస్ట్ కోసం బిగ్ బాస్.. ఇమ్మూ, తనూజ మధ్య ఫైనల్గా బాల్స్ గేమ్ పెట్టాడు.
అయితే ఈ ఆటలో ఇమ్ము కాలు బెణికి కిందపడిపోయాడు. నొప్పి తట్టుకోలేక కాసేపు గేమ్ ఆపమని కోరాడు. నొప్పితో విలవిల్లాడుతున్న అతడిని మెడికల్ రూమ్‌కు తీసుకెళ్లారు. ఇక ఈ గేమ్‌లో తనూజ గెలిచి సెకండ్ ఫైనలిస్ట్ అయింది. కాకపోతే తను ప్రేక్షకుల ఓట్లతోనే కొనసాగుతానని ఇమ్యూనిటీని తిరస్కరించింది. కాగా ఈ వారం లక్ కలిసొచ్చి ఇమ్ము సేఫ్ అవుతాడా లేక ఓట్స్ వచ్చి ఎలిమినేట్ అవుతాడా అనేది ఆదివారం ఎపిసోడ్‌లో తెలియాల్సి ఉంది.






