- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్‌బాస్-9: రీతూ బండారం మొత్తం బయటపెట్టిన నాగార్జున.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
బిగ్‌బాస్ షో స్టార్ట్ అయి రెండు వారాలు పూర్తి కావోస్తోంది. ఇక ఆడియన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వీకెండ్ రానే వచ్చేసింది.

దిశ, సినిమా: బిగ్‌బాస్ షో స్టార్ట్ అయి రెండు వారాలు పూర్తి కావోస్తోంది. ఇక ఆడియన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వీకెండ్ రానే వచ్చేసింది. ఎందుకంటే వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున్ హౌస్‌మెట్స్ వారం అంతా చేసిన ఓవరాక్షన్స్‌కి తగిన గుణపాఠం చెప్తారు కాబట్టి అంతా వెయిట్ చేశారు. ఇక ఈ వారం నాగ్ అందరికీ స్ట్రాంగ్‌గానే ఇచ్చిపడేశాడు. కెప్టెన్సీ టాస్క్‌లో జరిగిన రచ్చను మళ్లీ మళ్లీ ప్రోమోలు వేసి తప్పు చేసిన వారిపై ఫుల్ ఫైర్ అయ్యారు. ఇక ఇందులో స్ట్రాంగ్ ప్లేయర్లు అయిన భరణి(Bharani), ఇమాన్యుయేల్(Emmanuel)ను కాదని సంచాలక్ అయిన రీతూ పవన్‌ను కెప్టెన్ అయ్యేలా చేసింది.
ఇక ఈ విషయాన్ని ప్రస్తావించి నాగ్.. రీతూని కడిగేశాడు. సంచాలక్‌గా ఫేవరిజం చూపించి పవన్ కెప్టెన్ అయ్యేలా చేయడం గురించి కౌంటర్లు వేశారు. రీతూ కావాలనే అలా చేసినట్లు రీతూ బండాకం బట్టబయలు చేశారు. అలాగే తప్పు పద్ధతిలో కెప్టెనం అయిన పవన్ నుంచి ఆ పవర్ తీసేసుకున్నారు. అంతటితో ఊరుకోకుండా.. రీతూ చౌదరికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇక చివరలో సెలబ్రిటీలంతా ఈ వారం నుంచి లగ్జరీ ఇంట్లో ఉంటారు.. సామాన్యులు అవుట్ హౌస్‌లో ఉండాలని కంటెస్టెంట్స్ స్థానాలు మార్చి ఊహించని షాకిచ్చాడు.






