బిగ్‌బాస్-9: దివ్వెల మాధురికి చుక్కలు చూపించిన ఆ ఇద్దరు.. పెత్తనం చెలాయించాలనుకుంటే ఊహించని షాక్!

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-15 05:54:01  IST  )

బిగ్‌బాస్-9 (Bigg Boss-9)6 వారంలోకి ఎంటర్ అవడంతో పాటు ఆరుగురు వైల్డ్ కార్డ్ ద్వారా ఇంట్లోకి వెళ్లారు.

బిగ్‌బాస్-9: దివ్వెల మాధురికి చుక్కలు చూపించిన ఆ ఇద్దరు.. పెత్తనం చెలాయించాలనుకుంటే ఊహించని షాక్!
X

దిశ, సినిమా: బిగ్‌బాస్-9 (Bigg Boss-9)6 వారంలోకి ఎంటర్ అవడంతో పాటు ఆరుగురు వైల్డ్ కార్డ్ ద్వారా ఇంట్లోకి వెళ్లారు. వారిలో ఒకరు దివ్వెల మాధురి. ఆమె ఇంట్లోకి వెళ్లి కొద్ది గంటలే అవుతున్నప్పటికీ అందరితో గొడవలు పడటం మొదలెట్టింది. ఇక వంట పనులు అప్పగించగా.. లేట్ చేసింది. దీంతో ఫుల్ ఫ్రస్టేషన్‌లో మిగతా హౌస్‌మెట్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే.. కళ్యాణ్ ఆమెతో మాట్లాడటానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు పిలిచి కూర్చిలో కూర్చోమన్నాడు. దానికి దివ్వెల మాధురి వెటకారంగా కూర్చోకపోతే ఊరుకోరా అనేసింది.

అయినప్పటికీ ఓపికగా.. వ్యవహరించిన కళ్యాణ్ ఈ రోజు వంట లేట్ అయింది.. రేపటి నుంచి షెడ్యూల్ మారాలని అంటాడు. నేను అరగంట కూర్చున్నప్పుడు లేట్ అవుతుందని తెలియదా? అప్పడేం చేశారని కెప్టెన్ కళ్యాణ్‌పై సీరియస్ అయింది. దీంతో పక్కనే ఉన్న దివ్య వంట ఆలస్యమవుతుందని అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించింది. ముగ్గురు పోటాపోటీగా వాదించుకున్నారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని దివ్వెల మాధురి(Divvela Madhuri) కళ్యాణ్(Kalyan), దివ్యపై గట్టి గట్టిగా అరిచింది.

దీంతో కళ్యాణ్ గౌరవంతో కూర్చోమని చెప్తే వెటకారంగా మాట్లాడటం అవసరమా అని అరుస్తాడు. దీంతో మాధురి వాయిస్ ఎందుకు లేస్తుంది? ఎందుకు అరుస్తున్నావ్ అని కోపంతో ఊగిపోయింది. అంతలా గొడవపడిన దివ్వెల మాధురి చివరకు కన్నీరు పెట్టుకోవడం గమనార్హం. పెత్తనం చెలాయించాలనుకుంటే షాక్ తగిలింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అది చూసిన నెటిజన్లు మొదటి రోజే చుక్కలు చూపించారుగా? అని అంటున్నారు.

Next Story