- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ కు ట్రోఫీతో పాటు మరో సర్ ప్రైజ్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజేతగా కామన్ మ్యాన్ కల్యాణ్ పడాల నిలిచిన

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజేతగా కామన్ మ్యాన్ కల్యాణ్ పడాల నిలిచిన విషయం తెలిసిందే. ఉత్కంఠ భరితంగా సాగిన గ్రాండ్ ఫినాలేలో చివరి వరకూ తనూజ విన్నర్ గా నిలుస్తుందన్న అంచనాలు తారుమారయ్యాయి. కల్యాణ్ పడాల ట్రోఫీతో పాటు రూ.35 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు. విన్నర్ ప్రైజ్ మనీ రూ.50 లక్షలు కాగా.. టాప్ 3లో ఉన్న డిమోన్ పవన్ రవితేజ ఇచ్చిన రూ.15 లక్షల ఆఫర్ తీసుకుని హౌస్ నుంచి బయటికి రావడంతో విన్నర్ ప్రైజ్ మనీ తగ్గింది.
కాగా.. కల్యాణ్ కు ట్రోఫీ, విన్నర్ ప్రైజ్ మనీతో పాటు బిగ్ బాస్ స్పాన్సర్స్ మరో సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ రియాలిటీ షో స్పాన్సర్స్ లో ఒకరైన రాఫ్ గ్రిప్పింగ్ సంస్థ కల్యాణ్ కు మరో రూ.5 లక్షల క్యాష్ ప్రైజ్ ను అందించారు. అలాగే మారుతీ సుజుకీ విక్టోరిస్ కారును కూడా సొంతం చేసుకున్నాడు. కామన్ మ్యాన్ బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా నిలవడంతో పాటు, అతను ఇండియన్ ఆర్మీలో పనిచేసిన వ్యక్తి కావడంతో నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.






