ఏపీలో టీడీపీకి బిగ్ షాక్

148

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మూకుమ్మడిగా 13జిల్లాల క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం విజయవాడలో సమావేశమైన టీడీపీ క్రిస్టియన్ సెల్ ఈ నిర్ణయం తీసుకుంది. క్రిస్టియన్ల పట్ల చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు నచ్చకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు క్రిస్టియన్ సెల్ నాయకులు ప్రకటన చేశారు. రాజకీయాల కోసం క్రిస్టియన్లను అవమానిస్తూ నిందలు వేయడం సరికాదన్నారు. చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.