సిట్టింగ్ ఎమ్మెల్యేకు షాక్.. చెప్పులతో కొడతామంటూ మహిళ వార్నింగ్ (వీడియో)

by  |
సిట్టింగ్ ఎమ్మెల్యేకు షాక్.. చెప్పులతో కొడతామంటూ మహిళ వార్నింగ్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎన్నికల వేళ ఓ మహిళ తమ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చింది. ప్రజా సమస్యలపై గళం వినిపించింది. తమ గ్రామానికి రోడ్డు వేయకపోతే చెప్పులతో కొడతామని బహిరంగంగా హెచ్చరించింది. ఈ సంచలన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల ప్రకారం.. యూపీలోని మహదేవ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రవి సోంకర్‌కు వ్యతిరేకంగా పలువురు మహిళలు నిరసన చేపట్టారు. వెంటనే తమ గ్రామానికి రోడ్డు నిర్మాణం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నిర్మాణం స్టార్ట్ చేయకపోతే.. ఎమ్మెల్యేకు చెప్పులతో స్వాగతం పలుకుతామని శకుంతలా దేవి అనే మహిళ వార్నింగ్ ఇచ్చారు.

ఈ సందర్భంగా శకుంతలా దేవి మాట్లాడుతూ.. ఇక్కడి ప్రజలే రవి సోంకర్‌కు ఓట్లేసి అసెంబ్లీకి పంపించారు. కానీ ఐదేళ్లలో ఈ గ్రామ ప్రజల కోసం ఎమ్మెల్యే రోడ్డు కూడా వేయించలేకపోయారు. కాబట్టి ఆయనకు ఓట్లు అడిగే హక్కు లేదు. వెంటనే రోడ్డు వేయించకపోతే ఎమ్మెల్యేకు చెప్పులతో స్వాగతం పలుకుతాం. ఆ చెప్పులతోనే కొట్టి చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. రోడ్లు లేకపోవడం వల్ల చాలా మందికి వివాహాలు కూడా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే శకుంతల ఒకప్పుడు బీజేపీ మహిళా మోర్చా విభాగానికి మండల అధ్యక్షురాలిగా పని చేయడం గమనార్హం.


Next Story

Most Viewed