- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాతీయ జెండాను ఘోరంగా అవమానించిన ఎమ్మెల్యే గండ్ర (వీడియో)
<p>దిశ, భూపాలపల్లి : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భూపాలపల్లి TRS ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన తన క్యాంపు కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ వివాదంలో ఇరుక్కున్నారు. జాతీయ జెండాను అవమానించారంటూ ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. భారత దేశంలోని ప్రతి పౌరుడు జాతీయ జెండాకు ఎనలేని గౌరవం ఇస్తుంటారు. జెండా కనబడగానే నిల్చుని వందనము చేసే సంస్కారం, సాంప్రదాయం భారతీయులుకు ఉంది. అలాంటిది ఎమ్మెల్యే గండ్ర మాత్రం […]</p>

దిశ, భూపాలపల్లి : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భూపాలపల్లి TRS ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన తన క్యాంపు కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ వివాదంలో ఇరుక్కున్నారు. జాతీయ జెండాను అవమానించారంటూ ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు.
భారత దేశంలోని ప్రతి పౌరుడు జాతీయ జెండాకు ఎనలేని గౌరవం ఇస్తుంటారు. జెండా కనబడగానే నిల్చుని వందనము చేసే సంస్కారం, సాంప్రదాయం భారతీయులుకు ఉంది. అలాంటిది ఎమ్మెల్యే గండ్ర మాత్రం జాతీయ జెండాను ఘోరంగా అవమానించారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన బూటు కాళ్లతోనే జెండావిష్కరించడంపై ప్రజలు మండిపడుతున్నారు. బూట్లు విడిచి జెండా ఎగరేస్తే ఆయన కాళ్ళు కందిపోతాయా అంటూ విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారం చూస్తూ అక్కడే ఉన్నవారు అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో వారికి కూడా జాతీయ జెండాపై గౌరవం లేదంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జాతీయ జెండాను అవమానపరిచిన ఎమ్మెల్యేపై అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా పలువురు డిమాండ్ చేస్తున్నారు.






