- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గవర్నర్ మాటల్లో వాస్తవం లేదు: భట్టి
<p>దిశ, న్యూస్‌బ్యూరో: గవర్నర్ ప్రసంగంలో వాస్తవాలు లేవని.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి, సాగునీటి ప్రాజెక్టుల పై క్లారిటీ ఇవ్వలేదన్నారు. పేదలకు ఇవ్వనున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పై ఆరేళ్ళ నుంచి ఒకటే మాట చెప్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రైతుబంధు, రైతు రుణమాఫీ అనేది కేవలం ఎన్నికల ఆయుధాలుగా ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. మిషన్ భగీరథ నీళ్ల కోసం రూ. 50వేల కోట్లు […]</p>

దిశ, న్యూస్‌బ్యూరో: గవర్నర్ ప్రసంగంలో వాస్తవాలు లేవని.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి, సాగునీటి ప్రాజెక్టుల పై క్లారిటీ ఇవ్వలేదన్నారు. పేదలకు ఇవ్వనున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పై ఆరేళ్ళ నుంచి ఒకటే మాట చెప్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రైతుబంధు, రైతు రుణమాఫీ అనేది కేవలం ఎన్నికల ఆయుధాలుగా ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. మిషన్ భగీరథ నీళ్ల కోసం రూ. 50వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఇంటికి నీళ్లు ఇవ్వలేదన్నాని విమర్శించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు, మహిళల పై దాడుల నివారణ చర్యలు కనిపించడం లేదని తెలిపారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నా.. గవర్నర్ ప్రసంగంలో పసలేదన్నారు. గవర్నర్ చదివి వినిపించిన పుస్తకంలో కూడా క్వాలిటీ లేకుండా ప్రింట్ చేశారని భట్టి విక్రమార్క చురకలు వేశారు.
tag:bhatti vikramarka, comments, against governor






