మందుబాబులకు భారీ గుడ్‌న్యూస్.. రేట్లు తగ్గింపు

by  |
మందుబాబులకు భారీ గుడ్‌న్యూస్.. రేట్లు తగ్గింపు
X

దిశ, ఆర్మూర్: మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. బీర్ల ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల బ్రాండ్ల బీర్లపై రూ.10 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక సెస్ నుంచి రూ.10 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గిన రేట్లు ఈ అర్థరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి. మద్యం దుకాణంలో ఉన్న బీర్లను పాత రేటుకే అమ్మనున్నారు. కొత్తగా మార్కెట్లకు గోదాంలకు వచ్చే బీర్లకు మాత్రమే కొత్త ధర వర్తించనుంది.

బీర్ల అమ్మకాలు తగ్గడంతో తెలంగాణ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్క లైటు బీరు పాత ధర రూ.150 ఉండటంతో గోదాంలో ఉన్న స్టాక్ రిటైల్ కు ఇవ్వకుండా నిలిపివేశారు. రూ.10 తగ్గించడంతో మద్యం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు


Next Story

Most Viewed