ఎలుగుబంటి హల్ చల్.. అకస్మాత్తుగా వ్యక్తి పై దాడి

by  |

దిశ, చెన్నూర్: మండలంలోని శివ లింగాపూర్ గ్రామ సమీపంలో ఎలుగుబంటి సంచారం హల్ చల్ చేసింది. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా తంగేడు పూల కోసం వెళ్లిన అక్కెం మల్లయ్య (55 సం,,) పై ఎలుగుబంటి దాడి చేసింది. అయితే దాడిలో తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటన స్థలానికి వెళ్లి బాధితున్ని 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాడి సమయంలో చాక చక్యంగా ప్రవర్తించడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Next Story