నిబంధనలు బేఖాతరు.. బడి, గుడి ఎదురుగా బార్ అండ్ రెస్టారెంట్

by Sridhar Babu |

<p>దిశ, మానకొండూరు : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా ఇటీవల ప్రారంభించిన కాకతీయ బార్ అండ్ రెస్టారెంట్‌ను వెంటనే మూసివేయాలని సీపీఐ మండల కార్యదర్శి బోయిన తిరుపతి డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అలుగునూర్ గ్రామంలోని డివిజన్ కార్యాలయం, హనుమాన్ ఆలయం, ప్రభుత్వ పాఠశాలకు ఎదురుగా కాకతీయ బార్ అండ్ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. బడి, గుడి ఎదురుగా బార్ నెలకొల్పడంతో ప్రజలు, విద్యార్థులు [&hellip;]</p>

నిబంధనలు బేఖాతరు.. బడి, గుడి ఎదురుగా బార్ అండ్ రెస్టారెంట్
X

దిశ, మానకొండూరు : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా ఇటీవల ప్రారంభించిన కాకతీయ బార్ అండ్ రెస్టారెంట్‌ను వెంటనే మూసివేయాలని సీపీఐ మండల కార్యదర్శి బోయిన తిరుపతి డిమాండ్ చేశారు.

ఈ సందర్బంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అలుగునూర్ గ్రామంలోని డివిజన్ కార్యాలయం, హనుమాన్ ఆలయం, ప్రభుత్వ పాఠశాలకు ఎదురుగా కాకతీయ బార్ అండ్ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. బడి, గుడి ఎదురుగా బార్ నెలకొల్పడంతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వ పాఠశాలకు ఉన్న గేట్లు మూసివేయడంతో దాదాపు 100 నుంచి 200 మంది విద్యార్థులు రాంగ్ రూట్‌లో బడికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గుడికి ఎదురుగా బార్ నిర్వహిస్తుండటంతో ఆలయానికి వచ్చే భక్తులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదని ఆయన మండిపడ్డారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు కల్పించుకొని బార్‌ను వెంటనే మూసివేసేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో కాకతీయ బార్‌ను ఇక్కడి నుంచి తొలిగించేంత వరకు పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి పిట్టల శ్రీనివాస్. AITUC నాయకులు ఎలవేణి శ్రీనివాస్, పరశురామ్‌లు పాల్గొన్నారు.

Next Story