బండి సంజయ్ అరెస్ట్.. గాయాలు

by  |
బండి సంజయ్ అరెస్ట్.. గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ రాజకీయం మరింత వేడెక్కుతోంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఇళ్లు, కార్యాలయాలతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో పోలీసుల సోదాలను నిరసిస్తూ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఇదే క్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సిద్దిపేట నుంచి దుబ్బాకకు వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ క్రమంలోనే బండి సంజయ్‌కు గాయాలు అయినట్లు తెలుస్తోంది. రఘునందన్‌రావు ఇళ్లలో సోదాలను ఖండించిన బండి సంజయ్ మాట్లాడుతూ.. దుబ్బాకలో ఎన్నికలు జరుగుతుంటే సిద్దిపేటలో పోలీసులు తనిఖీలు చేయడం ఏంటని ప్రశ్నించారు. సోదాలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని.. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం దుందుడుకు చర్యగా అభివర్ణించారు.


Next Story