బీజేపీలోకి మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి?

by  |
బీజేపీలోకి మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి?
X

దిశ, వెబ్‌డెస్క్: బండ కార్తీక రెడ్డి.. కాంగ్రెస్ హయాంలో జీహెచ్ఎంసీ మేయర్. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరం‌లో కాంగ్రెస్ హవా తగ్గినా వ్యక్తిగతంగా, రాజకీయంగా పట్టు ఉన్న నాయకురాలు కార్తీక రెడ్డి. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ముందుండి నడిపిస్తారని అందరూ అనుకుంటున్న సమయంలో టీకాంగ్రెస్‌కు భారీ షాక్ ఇచ్చారు.

దుబ్బాక విజయంతో బీజేపీ ఊపు అందుకుంటున్న సమయంలో బండ కార్తీక రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లనున్నారు. దీంతో కమలం పార్టీకి మరింత లాభం చేకూరనుంది. అందుకే ఆలస్యమెందుకంటూ బీజేపీ నాయకులతో చర్చలు జరిపిన బండ కార్తీక రెడ్డి ఈ గురువారమే బీజేపీ కండువా కప్పుకోనున్నారు. టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు పద్మ వ్యూహాలు రచిస్తున్న భారతీయ జనతా పార్టీకి బండ కార్తీక రెడ్డి చేరికతో మరింత బలం చేకూర్చుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతుండడంతో ఈ సారి ఎన్నికలు మరింత ఉత్కంఠను రేపుతున్నాయి. గత ఎన్నికల్లో బండ కార్తీక రెడ్డి సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం అశించి భంగపడ్డ విషయం తెలిసిందే. ఏకంగా ఢిల్లీకెళ్లి ధర్నా చేసినా ఆమెకు టికెట్ మాత్రం ఇవ్వలేదు. ఈ పరిణామలతోనే అప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న బండకార్తీక రెడ్డి తాజాగా బీజేపీలో చేరడం గమనార్హం.

Next Story

Most Viewed