NTR : ఎన్టీఆర్ జయంతి.. ఫ్యాన్స్‌కు బాలయ్య గిఫ్ట్

by Jakkula Samataha |   (  Updated:2021-05-27 00:58:38  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: రేపు తెలుగువారి ఆరాధ్యదైవం నందమూరి తారకరామారావు జయంతి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఫ్యాన్స్‌కు నటసింహం నందమూరి బాలకృష్ణ  (Nandamuri BalaKrishna )ఏదోక సర్‌ప్రైజ్ ఇస్తూ ఉంటారు. మే 28న మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య నటించిన &#8216;అఖండ&#8217; సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ సెకండ్ వేవ్ విజృంభణ కారణంగా లాక్ డౌన్ విధించడంతో వాయిదా పడింది. దీంతో లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఆ సినిమా విడుదలయ్యే అవకాశముంది. ఈ [&hellip;]</p>

NTR : ఎన్టీఆర్ జయంతి.. ఫ్యాన్స్‌కు బాలయ్య గిఫ్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: రేపు తెలుగువారి ఆరాధ్యదైవం నందమూరి తారకరామారావు జయంతి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఫ్యాన్స్‌కు నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri BalaKrishna )ఏదోక సర్‌ప్రైజ్ ఇస్తూ ఉంటారు. మే 28న మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య నటించిన ‘అఖండ’ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ సెకండ్ వేవ్ విజృంభణ కారణంగా లాక్ డౌన్ విధించడంతో వాయిదా పడింది. దీంతో లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఆ సినిమా విడుదలయ్యే అవకాశముంది.

ఈ క్రమంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రేపు ఫ్యాన్స్‌కు బాలయ్య గిఫ్ట్ అందించనున్నారు. అది ఏంటంటే.. తాను ఆలపించిన శ్రీరామ దండకంను రేపు ఉదయం 9.45 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని NBK FILMS ట్విట్టర్‌లో ప్రకటించింది. ‘ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఆలపించిన శ్రీరామ దండకం.. మీ కోసం రేపు ఉదయం 9.45 గంటలకు.. చూస్తూ ఉండండి’ అని NBK FILMS ట్టర్‌లో పేర్కొంది.

దీంతో దీని కోసం నందమూరి ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. గత ఏడాది తన జన్మదినం సందర్భంగా ఎన్టీఆర్ నటించిన ‘జగదేకవీరుని కథ’ చిత్రంలోని ‘శివశంకరీ శివానందలహరి’ పాటను బాలయ్య స్వయంగా పాడి సర్‌ప్రైజ్ ఇచ్చారు.

Next Story