- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాబుకు అవంతి సవాల్
by Vemula.Srinu Prasad |
<p>టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మంత్రి అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో అవంతి మాట్లాడుతూ, ఒక్క పాజిటివ్ కేసును దాచినట్టు బాబు నిరూపించినా తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. లేనిపక్షంలో ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల సంఖ్యను ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నామని అన్నారు. నమూనాల సేకరణ నుంచి నిర్ధారణ పరీక్షల వరకు అధికారులు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తోందని […]</p>

X
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మంత్రి అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో అవంతి మాట్లాడుతూ, ఒక్క పాజిటివ్ కేసును దాచినట్టు బాబు నిరూపించినా తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. లేనిపక్షంలో ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు.
రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల సంఖ్యను ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నామని అన్నారు. నమూనాల సేకరణ నుంచి నిర్ధారణ పరీక్షల వరకు అధికారులు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తోందని ఆయన తెలిపారు. విశాఖ జిల్లాలో ఇవాళ మరో పాజిటివ్ కేసు నమోదైందని ఆయన వెల్లడించారు. విశాఖ జిల్లాలో మొత్తం 21 బాధితుల్లో 16 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని ఆయన ప్రకటించారు.
tags: ysrcp, tdp, avanthi srinivas, chandrababu naidu, challenge
Next Story






