సింగిల్ ఛార్జ్ కు 250 కిలో మీటర్ల మైలేజ్..కారు ధ‌ర, ఫీచ‌ర్స్ ఇవే !

by velandi.Saikiran |

నాలుగు మోడల్ కార్లు ఉన్నాయి. బేస్ మోడల్ లో 19.2 kwh బ్యాటరీ అందిస్తున్నారు. ఈ కారు 250 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు

సింగిల్ ఛార్జ్ కు 250 కిలో మీటర్ల మైలేజ్..కారు ధ‌ర, ఫీచ‌ర్స్ ఇవే !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇండియన్ మార్కెట్లో అనేక రకాల కార్లు వస్తున్న సంగతి తెలిసిందే. పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో చాలామంది ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే కార్లు కూడా మార్కెట్లోకి లాంచ్‌ అవుతున్నాయి. అలాంటి వాటిలో టాటా టియాగో (Tata Tiago EV ) ఒకటి. ఈ కారు ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే 250 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

ఇందులో నాలుగు మోడల్ కార్లు ఉన్నాయి. బేస్ మోడల్ లో 19.2 kwh బ్యాటరీ అందిస్తున్నారు. ఈ కారు 250 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. మరో మోడల్ లో 24 kwh బ్యాటరీ ఉండగా, ఈ కారు 315 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇక ఈ కారు 10 సెకన్లలోనే 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. టాటా టియాగోలో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ కూడా అందిస్తున్నారు. ఈ టాటా టియాగో బేస్ మోడల్ కారు ధర రూ.7.79 లక్షలుగా ఉంది. ఇది ఎక్స్ షోరూం ధర మాత్రమే. కారు కొనుగోలు చేసుకోవాలనే వారు రెండు నెలల ముందే బుక్ చేసుకోవాలి.

Next Story