Royal Enfield 650: స్టన్నింగ్ లుక్‌తో కొత్త బుల్లెట్ బండి..లాంచ్ ఎప్పుడంటే?

by Vennela |

Royal Enfield 650: మనదేశంలో రాయల్ ఎన్ ఫీల్ట్ బైక్స్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు.

Royal Enfield 650: స్టన్నింగ్ లుక్‌తో కొత్త బుల్లెట్ బండి..లాంచ్ ఎప్పుడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: Royal Enfield 650: మనదేశంలో రాయల్ ఎన్ ఫీల్ట్ బైక్స్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని ముద్దుగా బుల్లెట్ బండి అని పిలుస్తుంటారు. వయస్సుతో సంబంధం లేకుండా ఈ బైక్ కు ఫ్యాన్స్ ఉన్నారంటే అర్థమౌతోంది ఈ బైక్ క్రేజ్ ఎలాంటిదో. అయితే ఈ మధ్యకాలంలో ఇతర కంపెనీల నుంచి వస్తున్న పోటీ నేపథ్యంలో రాయల్ ఎన్ ఫీల్డ్ కూడా ఎప్పటికప్పుడు కొత్త బైక్స్ ను మార్కెట్లోకి లాంచ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ లో మరో నాలుగు రోజుల్లో రాయల్ ఎన్ఫీల్డ్ 650 సీసీ క్లాసికల్ బైక్ లాంచ్ కానుంది. రాయల్ ఎన్ఫీల్డ్ 650 సీసీ క్లాసిక్ బైక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రాయల్ ఎన్ఫీల్డ్ కాస్లిక్ 650 లాంచ్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ బైక్ ను మార్చి 27న భారత్ లో లాంచ్ చేయనున్నారు. 650 సీసీ క్రూయిజర్ బైకెన్ 650, సూపర్ మీటియర్ 650, ఇంటర్ సెప్టర్ 650, కాంటినెంటర్ జీటీ 650, బేర్ 650 తర్వాత బ్రాండ్ నుంచి విడుదలయ్యే బైక్ క్లాసి్ 650. కాగా రాయల్ ఎన్ఫీల్డ్ గతేడాది కొత్త క్లాసిక్ 650ని మార్కెట్లోకి లాంచ్ చేసింది. డిజైన్ పరంగా ఇది క్లాసిక్ 350లో మాదిరిగానే రెట్రో లుక్ తో లాంచ్ చేసింది. రాయల్ ఎన్ఫిల్డ్ 650 సీసీ క్లాసిక్ బైకులో 647సీసీ, ఎయిర్ ఆయిల్ కూల్డ్, ప్యారలల్ ట్విన్ ఇంజిన్ తో వస్తుంది.

ఈ బైక్ లుక్ 350సీసీ క్లాసిక్ మోడల్‌ను పోలి ఉంటుంది. ఇది రౌండ్ హెడ్‌ల్యాంప్, పొజిషన్ లైట్లు, రెట్రో-స్టైల్ ఇండికేటర్లు , టియర్‌డ్రాప్ ఆకారపు ఇంధన ట్యాంక్‌ను పొందుతుంది. దీనితో పాటు, ఒక పెద్ద అనలాగ్ క్లస్టర్, ట్రిప్పర్ మీటర్ కూడా ఇందులో ఉంటాయి. క్లాసిక్ అప్పీల్‌ను కొనసాగించడానికి, బైక్ ముందు భాగంలో 19-అంగుళాల టైర్లతో, వెనుక భాగంలో 18-అంగుళాల టైర్లతో వైర్-స్పోక్ వీల్స్‌తో వస్తుంది.రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 ట్విన్ ఫ్రేమ్, సబ్-ఫ్రేమ్, స్వింగ్‌ఆర్మ్ షాట్‌గన్ 650 నుండి తీసుకుంది. దీనికి ఫ్రంట్ 43mm టెలిస్కోపిక్ షోవా ఫోర్కులు..బ్యాక్ ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు లభిస్తాయి. బ్రేకింగ్ కోసం డిస్క్ బ్రేక్‌లు అందించింది. సేఫ్టీ కోసం డ్యూయల్-ఛానల్ ABS ప్రమాణంగా అందుబాటులో ఉంటుంది.

లాంచ్ తర్వాత, ఈ బైక్ BSA గోల్డ్‌స్టార్ 650 వంటి ప్రీమియం బైక్‌లతో నేరుగా పోటీపడుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 ట్విన్ భారతీయ మార్కెట్లో రెట్రో-నేపథ్య ఆధునిక క్రూయిజర్‌గా ప్రవేశపెడుతుంది. ఇది క్లాసిక్ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్ గొప్ప కలయికను అందిస్తుంది.

Next Story