- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్వరలో ఇండియన్ మార్కెట్‌లోకి ONEPLUS 15.. లాంచ్ డేట్, ధర పూర్తి వివరాలు ఇవే
ఆండ్రాయిడ్‌లో ఎక్కువ మంది ఇష్టపడే మొబైల్ వన్ ప్లస్ (one plus mobile). ప్రస్తుతం వన్ ప్లస్ ఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో వినియోగదారుల అభిరుచికి తగినట్టు వన్ ప్లస్ సైతం ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్‌లతో ముందుకు వస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ఆండ్రాయిడ్‌లో ఎక్కువ మంది ఇష్టపడే మొబైల్ వన్ ప్లస్ (one plus mobile). ప్రస్తుతం వన్ ప్లస్ ఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో వినియోగదారుల అభిరుచికి తగినట్టు వన్ ప్లస్ సైతం ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్‌లతో ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే వన్ ప్లస్ 15 (one plus 15)ను చైనా మార్కెట్ లో విడుదల చేయబోతుంది. దీంతో ఇండియన్ మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుందా అని టెక్ లవర్స్ ఎదురుచూస్తున్నారు. కాగా టెక్ దునియా సమాచారం ప్రకారం ఈ మోడల్ నవంబర్ 13న లాంచ్ కాబోతున్నట్టు తెలుస్తోంది.
అంతే కాకుండా భారత్‌లో దీని ధర రూ.65వేల నుండి రూ.75వేల మధ్యన ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. వన్ ప్లస్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే.. OnePlus 13sకు ఇది అప్‌గ్రేడ్ వర్షన్‌గా రాబోతున్నట్టు సమాచారం. ఇందులో 6.78-అంగుళాల BOE X3 LTPO OLED డిస్ ప్లే 165Hz రీఫ్రెష్ రేట్‌తో ఉండబోతుందట.
Qualcomm Snapdragon 8 Elite Gen 5 ద్వారా ఇది పనిచేస్తుందని తెలుస్తోంది. 12జీబీ ర్యామ్‌తో అందుబాటులోకి వస్తోంది. అదే విధంగా ట్రిపుల్ కెమెరా సెటప్ తో 50 MP Wide Angle Primary Camera, 50 MP Ultra-Wide Angle Camera, 50 MP Periscope కెమెరాలు ఇందులో ఉండబోతున్నాయట. ఫ్రంట్ కెమెరా సైతం 32 మెగాపిక్సల్ ఉండగా 7300 mAh బ్యాటరీ, 120W హై స్పీడ్ చార్జింగ్‌కు ఇది సపోర్ట్ చేయనుందని తెలుస్తోంది. లేటెస్ట్ ఫీచర్లు ఉండటంతో ఇది చాలా ఫోన్లకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది.






