ఈ ఎలక్ట్రిక్ వాహనాలపై రూ.50 వేల వరకు డిస్కౌంట్ !

by velandi.Saikiran |

అక్షయ తృతీయ సందర్భంగా అదిరిపోయే ప్రకటన చేసింది ఓలా కంపెనీ.

ఈ ఎలక్ట్రిక్ వాహనాలపై రూ.50 వేల వరకు డిస్కౌంట్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: అక్షయ తృతీయ సందర్భంగా అదిరిపోయే ప్రకటన చేసింది ఓలా కంపెనీ. ఓలా సోనా వీకెండ్ ప్రకటించింది కంపనీ. తమ పోర్టు ఫోలియోలోని అన్ని వాహనాలపై రూ.50 వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే కొత్త వాహనాల కొనుగోలుపై రూ. 40 వేల వరకు డిస్కౌంట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, స్కాపియా ఫెడరల్, HDFC, ఐబీఎఫ్, ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అదనంగా పది వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ.

అయితే ఈ ఆఫర్లు శని, ఆదివారం మాత్రమే అందుబాటులో ఉంటాయని పేర్కొంది. తాజాగా ప్రకటించిన ఆఫర్ల ప్రకారం జెన్ 3 S1 X, రోడ్ స్టర్ X ఎలక్ట్రిక్ బైక్స్ ధర 50 వేలుగా ఫిక్స్ చేశారు. రోడ్ స్టర్ X+ 9.1kwh ఎలక్ట్రిక్ బైక్ పై ఏకంగా రూ. 50 వేల వరకు డిస్కౌంట్ ఇచ్చింది. దీంతో ఈ బైక్ రూ.1.40 లక్షలకు పొందవచ్చు. ఇక ఈ రెండు రోజుల్లో బైక్స్ కొనుగోలు చేసిన వారిలో లక్కీ డ్రా విజేతకు ఓలా సోనా స్పెషల్ ఎడిషన్ బహుమతిగా ఇస్తామని తెలిపింది.

Next Story