- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Solar Powered Car: ఇండియా మొట్టమొదటి సోలర్ కారు.. ఫీచర్లు భలే ఉన్నాయిగా.. ధర ఎంతంటే?
Solar Powered Car: భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచే కారు వేవీ ఈవా లాంచ్ అయ్యింది.

దిశ, వెబ్ డెస్క్: Solar Powered Car: భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచే కారు వేవీ ఈవా లాంచ్ అయ్యింది. ఈ వేవీ ఈవా, నోవా, స్టెల్లా, వెగా అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇవి రూ. 3.25 లక్షలు. బ్యాటరీ సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ తో అందుబాటులో ఉంది. బ్యాటరీ ధర రూ. 3.99 లక్షలు. సౌరశక్తితో నడిచే ఈ కారు ధర మొదటి 25,00 మంది యూజర్లకు మాత్రమే పరిమితం. వేవీ మొబిలిటీ తొలిసారిగా 2023 ఆటో ఎక్స్ పోలో తమ సౌరశక్తితో నడిచే ఈవాను ప్రదర్శించింది. వేవీ ఈవా ఒక స్థిరమైన, చౌకైన పట్టణ ప్రయాణ ఎంపిక అని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల పరిధిని హామీ ఇస్తుంది. సౌరశక్తితో నడిచే ఈ కారు ఏడాదికి 3000కిలోమీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.
చాలా మంది యజమానులు సగటున 35కిలోమీటర్ల కంటే తక్కువ రోజువారీ ప్రయాణాన్ని ప్రతి కారుకు సగటున 1.5కంటే తక్కువ ప్రయాణీకులు ఉన్నారని వేవీ తెలిపింది. అందువల్ల అర్బన్ మొబిలీటీ యూజర్లకు ఈవాఈవీ ఈ అవసరాలకు తీరుస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది కిలోమీటరుకు కేవలం రూ. 0.5 పైసల నిర్వహణ ఖర్చు మాత్రమేనని తెలిపింది. ప్రస్తుత మార్కెట్లో అమ్మకానికి ఉన్న అనేక ఎలక్ట్రిక్ వాహనాల కంటే ఇవా చాలా చౌక అని పేర్కొంది. ఈ స్టార్టప్ ఈవా సౌరశక్తితో నడిచే ఈ కారను రెండో కారుగా నగర, పట్టణ ప్రయాణికులు ఉపయోగించుకోవచ్చని తెలిపింది. యుటిలిటీ పరంగా ఎంజీ కామెట్ ఈవీతో ఈ ఈవా పోటీ పడుతుంది.
సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 50కిలోమీటర్ల అదనపు పరిధిని కలిగి ఉన్న హై వోల్టెజ్ పవర్ ట్రేయిన్ ను కలిగి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ ఓవర్ ది ఎయిర్ అప్ డేట్స్, రిమోట్ మానిటరింగ్ , వెహికల్ డయాగ్నస్టిక్స్ కూడా ఇందులో ఉంటాయి. ఇది తేలికపాటి టిజైన్, ఇంజనీరింగ్ కలిగి ఉంటుందని తక్కువ రన్నింగ్ ఖర్చులు, తక్కువ కాలుష్యాన్ని నిర్థారిస్తుందని హామీ ఇస్తుంది.






