- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిడిల్ క్లాస్ వాహనదారులకు తీపికబురు.. హీరో నుంచి గ్రేట్ లుక్‌తో సూపర్ స్ప్లెండర్
హీరో మోటోకార్ప్ సరికొత్త ‘సూపర్ స్ప్లెండర్ XTEC 2.0 బైక్‌ను ఇవాళ లాంచ్ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘హీరో మోటోకార్ప్’ భారత మార్కెట్లోకి సరికొత్త బైక్‌ను విడుదల చేసింది. ఏళ్లుగా ప్రజాదరణ పొందిన సూపర్ స్ప్లెండర్ సిరీస్‌లో బెస్ట్ అప్‌డేట్లతో ‘హీరో సూపర్ స్ప్లెండర్ XTEC 2.0’ మోడల్‌ను లాంచ్ చేసింది. దేశీయ మార్కెట్లో దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 86,500 గా సంస్థ నిర్ణయించింది. ఈ సరికొత్త బైక్‌లో 124.7సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అందించారు. ఐడిల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్ i3S టెక్నాలజీ సహాయంతో ఈ బైక్ లీటరుకు ఏకంగా 72 కి.మీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. అంతేకాకుండా, ట్రాఫిక్‌లో బైక్ సైలెంట్‌గా స్టార్ట్ అవ్వడం కోసం ఇందులో ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (ISG)ని అమర్చారు.
బైక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. దీనివల్ల కాల్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, కాలర్ ఐడీ, ఫోన్ బ్యాటరీ స్టేటస్, రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్ వంటి సమాచారాన్ని స్క్రీన్‌పైనే చూడవచ్చు. ప్రయాణంలో మొబైల్ ఛార్జింగ్ కోసం USB టైప్-సి పోర్ట్ కూడా ఇచ్చారు.
సేఫ్టీ విషయానికి వస్తే.. హజార్డ్ లైట్లు, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, హ్యాండిల్‌బార్‌పైనే ఇంజిన్ కిల్ స్విచ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ బైక్‌కు సరికొత్త డ్యూయల్-టోన్ గ్రాఫిక్స్, XTEC 2.0 బ్యాడ్జింగ్, రిమ్ టేప్స్, డ్యూయల్-టెక్స్చర్ సీట్‌ను అందించారు. ఈ బైక్ మొత్తం గ్లాసీ బ్లాక్, కాండీ బ్లేజింగ్ రెడ్, మాట్ ఆక్సాస్ గ్రే, మాట్ నెక్సస్ బ్లూ, మాట్ చెస్ట్‌నట్ బ్రౌన్ రంగులలో లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న హీరో మోటోకార్ప్ డీలర్‌షిప్‌లలో ఇవాళ్టి నుంచి బుకింగ్స్ మొదలయ్యాయి.






