TVS నుంచి కొత్త బైక్స్‌..ధ‌ర‌, ఫీచ‌ర్స్

by velandi.Saikiran |

SXC DD, TFT DD పేరుతో రెండు కొత్త వేరియంట్స్ రిలీజ్ చేసింది టీవీఎస్.

TVS నుంచి కొత్త బైక్స్‌..ధ‌ర‌, ఫీచ‌ర్స్
X

దిశ‌, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా టూవీలర్ వాహనాల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో టీవీఎస్ మోటార్ కంపెనీ అదిరిపోయే ప్రకటన చేసింది. టీవీఎస్ రైడర్ 125 మోడల్ ను ( TVS Raider 125) కొత్త క‌ల‌ర్స్ తో తాజాగా రిలీజ్ చేసింది కంపెనీ. అందరినీ ఆకర్షించే విధంగా ఈ బైక్స్ రూపొందించారు. స్పోర్ట్స్ బైక్ తరహాలోనే దీన్ని తీర్చిదిద్దారు.

SXC DD, TFT DD పేరుతో రెండు కొత్త వేరియంట్స్ రిలీజ్ చేసింది టీవీఎస్. ఈ టీవీఎస్ రైడర్ 125 మోడల్ లో కొత్తగా నైట్రో గ్రీన్ కలర్ కూడా లాంచ్ చేశారు. ఈ బైక్స్ 11.38 HP పవర్ ను 11.2 NM టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఐదు గేర్లు దీనికి అందిస్తున్నారు. TVS డ్రమ్ బైక్స్ ఎక్స్ షోరూం ధర రూ.82,860 గా ఫిక్స్ చేశారు. ఈ బైక్స్ ధర ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా ఉంటుంది. టీవీఎస్ SXC DD బైక్ ధ‌ర రూ.96,725గా ఉండ‌గా, టీవీఎస్ TFT DD బైక్ ధ‌ర రూ. 98, 725 గా ఫిక్స్ చేశారు.

Next Story