- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటో డ్రైవర్ల ఘాతుకం.. మైనర్ బాలికను బంధించి మరీ..
<p>దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. చిన్నా , పెద్దా అనే తేడా లేకుండా పసి పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై ఇద్దరు ఆటో డ్రైవర్లు అత్యాచారం చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్లితే.. నగరంలోని లంగర్ హౌస్‌లో నివాసం ఉంటున్న బాలిక దుకాణానికి వెళ్లింది. ఒంటరిగా ఉన్న బాలికను గమనించిన ఆటో డ్రైవర్ అతని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. చిన్నా , పెద్దా అనే తేడా లేకుండా పసి పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై ఇద్దరు ఆటో డ్రైవర్లు అత్యాచారం చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్లితే.. నగరంలోని లంగర్ హౌస్‌లో నివాసం ఉంటున్న బాలిక దుకాణానికి వెళ్లింది. ఒంటరిగా ఉన్న బాలికను గమనించిన ఆటో డ్రైవర్ అతని స్నేహితుడితో కలసి బాలికను ఆటోలో ఎక్కించుకొని వెళ్లారు. అనంతరం ఆమెను ఓ ఇంటిలో బంధించి ఇద్దరూ అత్యాచారం చేశారు. తన కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసుకు ఫిర్యాదు చేశారు. సిటీఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.
Next Story






