ఏవో నుంచి డోమినిక్ థీమ్ ఔట్.. క్వార్టర్స్‌లో జకోవిచ్, సెరేనా, ఒసాకా

by  |
ఏవో నుంచి డోమినిక్ థీమ్ ఔట్.. క్వార్టర్స్‌లో జకోవిచ్, సెరేనా, ఒసాకా
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా ఓపెన్ 7వ రోజు సంచలనం నమోదైంది. అమెరికా ఓపెన్ మెన్స్ సింగిల్స్ చాంపియన్, 3వ సీడ్ డోమినిక్ థీమ్ ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి 4వ రౌండ్‌లోనే నిష్క్రమించాడు. ఆదివారం 18వ సీడ్ గ్రిగొర్ దిమిత్రోవ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6-4, 6-4,6-0 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. థీమ్ ఈ ఏడాది యూఎస్ ఓపెన్ చాంపియన్ కావడంతోపాటు 2020లో ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్‌గా నిలిచాడు. 4వ రౌండ్ మ్యాచ్‌లో దిమిత్రోవ్ మొదటి, రెండో సెట్లో సర్వీస్ చేజార్చుకున్నా.. వరుస ర్యాలీలతో మూడు సెట్లలో ఆధిపత్యం ప్రదర్శించాడు. దీంతో థీమ్ ఒక్క సెట్ కూడా గెలవకుండానే మ్యాచ్ చేజార్చుకున్నాడు. క్వార్టర్ ఫైనల్‌లో దిమిత్రోవ్ 114వ ర్యాంకర్ అస్లన్ కరత్సేవ్‌తో తలపడనున్నాడు. 1996 తర్వాత అరంగేట్ర గ్రాండ్‌స్లామ్‌లోనే క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న ప్లేయర్‌గా అస్లన్ కరత్సేవ్ రికార్డు సృష్టించాడు. వరల్డ్ నెంబర్ 1 నోవాక్ జకోవిచ్ గాయం నుంచి కోలుకొని 4వ రౌండ్ మ్యాచ్ ఆడాడు. మిలాస్ రోనిక్‌తో జరిగిన మ్యాచ్‌లో 7-6(4), 4-6, 6-1, 6-4 తేడాతో విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. 6వ ర్యాంకర్ జ్వెరెవ్ 6-4, 7-6 (5), 6-3 తేడాతో జాజోవిక్‌పై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు.

మహిళల సింగిల్స్‌లో 2వ ర్యాంకర్ సిమోన హెలెప్ 3-6, 6-1, 6-4 తేడాతో 15వ సీడ్ ఇగా ష్వామ్‌టెక్‌పై విజయం సాధించింది. 10వ సీడ్ సెరేనా విలియమ్స్ 6-4, 2-6, 6-4 తేడాతో సబలెంకపై గెలిచి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. అన్ సీడెడ్ హేయ్ 6-4, 6-2 తేడాతో మార్కెట వోండ్రోసోవాపైగెలిచి క్వార్టర్స్ చేరింది. యూఎస్ ఓపెన్ చాంపియన్ నయోమి ఒసాక 4-6, 6-4, 7-5 తేడాతో ముగురుజాపై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరింది.

Next Story

Most Viewed