విజయ్ స్టంట్స్ చూశాక.. ‘కేజీఎఫ్ 2’ యాక్షన్ సీక్వెన్స్ మరిచిపోతారు

by  |
విజయ్ స్టంట్స్ చూశాక.. ‘కేజీఎఫ్ 2’ యాక్షన్ సీక్వెన్స్ మరిచిపోతారు
X

దిశ, సినిమా : ఇళయ దళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. దీని తర్వాత వెంటనే సన్ పిక్చర్స్ నిర్మాణ సారథ్యంలో తన 65వ చిత్రాన్ని ప్రకటించారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను మించి ఉండబోతోందని టాక్. సినిమా అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒక అప్‌డేట్‌తో ట్రెండింగ్‌లోకి వస్తున్న సినిమా తాజాగా టీమ్‌లో చేరిన స్టంట్ కొరియోగ్రాఫర్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి ట్రెండ్ అవుతోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అన్బు అండ్ అరివు టీంకు చెందిన దిలీప్ కుమార్.. ఇన్‌స్టాగ్రామ్ లైవ్ వీడియోలో ఇందుకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావించారు. పవర్ ప్యాక్డ్ ఫిల్మ్‌లో యాక్షన్ సీక్వెన్స్ కేజీఎఫ్: చాప్టర్ 2 ను ఆడియన్స్ మరిచిపోయేలా ఉంటాయన్నారు. ఈ సినిమా చూశాక అందరూ విజయ్ యాక్షన్ స్టంట్స్ గురించే మాట్లాడతారని తెలిపారు. దీంతో ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్.

https://twitter.com/Vijay65TheFilm/status/1364225735171268613?s=20


Next Story

Most Viewed