విజయవాడలో పట్టపగలే కత్తిపోట్ల కలకలం

by Vadlamudi Anukaran |   (  Updated:2020-09-07 05:47:16  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో పట్టపగలే కత్తిపోట్ల కలకలం రేగింది. సోమవారం టుటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద బైనేని సాయిని.. ఈశ్వర్ అనే వ్యక్తి కత్తితో విచక్షణా రహితంగా పొడవడంతో ఒళ్లంతా తీవ్రగాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న బాధితుడిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సాయిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.</p>

విజయవాడలో పట్టపగలే కత్తిపోట్ల కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో పట్టపగలే కత్తిపోట్ల కలకలం రేగింది. సోమవారం టుటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద బైనేని సాయిని.. ఈశ్వర్ అనే వ్యక్తి కత్తితో విచక్షణా రహితంగా పొడవడంతో ఒళ్లంతా తీవ్రగాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న బాధితుడిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సాయిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Next Story