- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎయిర్ పోర్ట్ ఉద్యోగిపై బీరు సీసాలతో దాడి
<p>దిశ, వెబ్‌డెస్క్ : రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి జరిగింది. మండలంలోని నాగారం గ్రామానికి చెందిన సయ్యద్ అజ్మత్ ఎయిర్ పోర్టులో పని చేస్తాడు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో వలిగొండ మండల కేంద్రంలో లోతుకుంట రోడ్డులో వెళ్తున్న అజ్మత్‌పై గుర్తు తెలియని 15 మంది దుండగులు బీరు సీసాలతో మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచారు. ఈ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి జరిగింది. మండలంలోని నాగారం గ్రామానికి చెందిన సయ్యద్ అజ్మత్ ఎయిర్ పోర్టులో పని చేస్తాడు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో వలిగొండ మండల కేంద్రంలో లోతుకుంట రోడ్డులో వెళ్తున్న అజ్మత్‌పై గుర్తు తెలియని 15 మంది దుండగులు బీరు సీసాలతో మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వచ్చిన స్థానికులను చూసి దుండగులు పారిపోయారు. బాధితుడిని చికిత్స నిమిత్తం రామన్నపేట ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Next Story






