దారుణం.. యువతిని అందరిముందు వీడియోతీస్తూ.. అలా చేయమన్నాడు

by  |
attack
X

దిశ, వెబ్‌డెస్క్ : నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రామకోటయ్య నగర్‌కు చెందిన ఓ యువతిపై ఓ వ్యక్తి విచక్షణరహితంగా దాడి చేశాడు. వ్యభిచారం చేయాలంటూ కర్రతో చితకబాదాడు. ఎంత బ్రతిమిలాడిన ఆ వ్యక్తి కనికరించలేదు. మరింత రెచ్చిపోయాడు. రక్తంకారేలా చితకబాదాడు. యువతిని కొడుతున్న దృశ్యాలను తన స్నేహితుడితో వీడియో తీయించి మరీ పైశాచిక ఆనందం పొందాడు. అంతేకాదు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అయ్యింది. దీంతో జిల్లా పోలీసు అధికారులు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు.

ఎస్పీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్

రామకోటయ్య నగర్‌లో జరిగిన ఘటనపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసి చలించిపోయిన ఆయన జిల్లా ఎస్పీ విజయరావుకు ఫోన్ చేశారు. రామకోటయ్య నగర్‌లోని ఘటనపై వివరణ అడిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నెల్లూరు రూరల్ పరిధిలో ఎటువంటి రౌడీయిజం, అసాంఘిక కార్యకలాపాలు జరిగినా ఉపేక్షించొద్దని కోరారు. అయితే దాడికి పాల్పడిన వ్యక్తి వెంకటేశ్‌గా గుర్తించినట్లు ఎస్పీ ఎమ్మెల్యేకు వివరించారు. దాడి చేస్తున్న దృశ్యాలను తన స్నేహితుడు శివకుమార్‌తో వీడియో తీయించినట్లు నిర్ధారించామని తెలిపారు. నిందితుడి కోసం డీఎస్పీ నేతృత్వంలో మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలియజేశారు.

కలువాయిలో నిందితుడు అరెస్ట్

రామకోటయ్య నగర్‌లో యువతిని చావబాదిన కేసులో నిందితుడు పళ్ల వెంకటేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కలువాయి సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. దీంతో ప్రజలు ఎస్పీ విజయరావుకు కృతజ్ఞతలు తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విజయరావు వెల్లడించారు.


Next Story

Most Viewed