ఈస్ట్ బెంగాల్‌పై మోహన్ బగాన్ విజయం

by  |
ఈస్ట్ బెంగాల్‌పై మోహన్ బగాన్ విజయం
X

దిశ, స్పోర్ట్స్ : ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌లో భాగంగా శుక్రవారం రాత్రి ఫర్టోడా స్టేడియంలో చిరకాల ప్రత్యర్థి ఎస్‌సీ ఈస్ట్ బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏటీకే మోహన్ బగాన్ 3-1 తేడాతో విజయం సాధించింది. టాస్ గెల్చిన ఎస్‌సీ ఈస్ట్ బెంగాల్ కిక్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. 15వ నిమిషంలో తిరి ఇచ్చిన పాస్‌ను కెప్టెన్ రాయ్ కృష్ణ గోల్ చేసి ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. కాగా, 41వ నిమిషంలో తిరి ఓన్ గోల్ చేయడంతో ఈస్ట్ బెంగాల్ ఖాతాలో ఒక గోల్ చేరింది. 72వ నిమిషంలో రాయ్ కృష్ణ ఇచ్చిన పాస్‌ను డేవిడ్ విలియమ్స్ గోల్ చేసి మోహన్ బగాన్ ఆధిక్యాన్ని 2-1కి పెంచాడు. 89వ నిమిషంలో స్ట్రైకర్ రాయ్ కృష్ణ ఇచ్చిన పాస్‌ను జేవియర్ హెర్నాండెజ్ గోల్ చేయడంతో మోహన్ బగాన్ ఆధిక్యం 3-1తో నిలిచింది. నిర్ణీత సమయంలోపు మరో గోల్ నమోదు కాలేదు. దీంతో మోహన్ బగాన్ జట్టు 3-1 తేడాతో విజయం సాధించింది. వరుస విజయాలతో దూసుకొని పోతున్న మోహన్ బగాన్ 39 పాయింట్లతో లీగ్ దశలో అగ్రస్థానంలో ఉన్నది. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు తిరి, హీరో ఆఫ్ ది మ్యాచ్ రాయ్ కృష్ణకు లభించింది.



Next Story

Most Viewed