పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ 'ఆథర్ గ్రిడ్ 2.0'ను ప్రారంభించిన ఆథర్ ఎనర్జీ

by  |
పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ ఆథర్ గ్రిడ్ 2.0ను ప్రారంభించిన ఆథర్ ఎనర్జీ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ ఆథర్ ఎనర్జీ సంస్థ తన కొత్త జనరేషన్ ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ ఆథర్ గ్రిడ్ 2.0ను ఆదివారం ప్రారంభించింది. ఈ కొత్త జనరేషన్ ఛార్జింగ్ స్టేషన్ అన్ని రకాలుగా అత్యాధునిక ఫీచర్లతో పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం దీన్ని బెంగళూరు, చెన్నై నగరాల్లో ప్రారంభించామని, త్వరలో దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ అందుబాటూలోకి తీసుకురానున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ కొత్త ఆథర్ గ్రిడ్ 2.0 భవిష్యత్తులో ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా మెరుగైన భద్రత, వేగవంతమైన నెట్‌వర్కింగ్, అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా నిర్మించామని కంపెనీ వివరించింది. అలాగే, ఈ ఆథర్ గ్రిడ్ 2.0 అన్ని సమయాల్లోను అందుబాటులో ఉంటుందని, దీనివల్ల దేశంలోని అన్ని నగరాల్లో ఛార్జింగ్ లోకేషన్‌కు సంబంధించిన వివరాలను అందిస్తుంది. ప్రస్తుతం సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తోంది. ఎలక్ట్రిక్ టూ-వీలర్ల కోసం అతిపెద్ద ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. ఇప్పటివరకు ఆథర్ ఎనర్జీ మొత్తం 215 ప్రాంతాల్లో, 21 నగరాల్లో విస్తరించింది. 2022 చివరి నాటికి అదనంగా మరో 500 నగరాల్లొ ఈ ఛార్జింగ్ గ్రిడ్ లక్ష్యంగా ఉన్నామని కంపెనీ వెల్లడించింది.



Next Story

Most Viewed