సామూహిక అత్యాచార నిందితుల అరెస్ట్..

by  |
సామూహిక అత్యాచార నిందితుల అరెస్ట్..
X

దిశ, తుంగతుర్తి: సామూహిక అత్యాచారంతో చికిత్స పొందుతూ మృతి చెందిన ఓ గిరిజన మహిళ సంఘటన కేసుని తుంగతుర్తి పోలీసులు చేధించారు. ఈ మేరకు శనివారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టి సీఐ రవికుమార్ మాట్లాడారు. వివరాల ప్రకారం ఈనెల 17న తుంగతుర్తి మండలం, రామన్నగూడెం గ్రామ నివాసి కాంతమ్మ ఇంటికి రాత్రి 9గంటల ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన గుగులోతు సోమ్లా అనే వ్యక్తి వచ్చాడు. నీకోసం ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చారని చెప్పి ఆమెను తనతో తీసుకెళ్లాడు. మరుసటి రోజు నుంచి కాంతమ్మకు కడుపు నొప్పి రావడంతో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తనపై జరిగిన అత్యాచారం విషయాన్ని కూతురు మంజులకు చెప్పి మృతి చెందినట్లు సీఐ తెలిపారు. మంజుల ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

సంఘటనకు కారకులైన సోములు(ఏ2)తో పాటు అతని స్నేహితులు తిరుమలగిరి మండలం మాలిపురం గ్రామానికి చెందిన కార్ డ్రైవర్ కొత్త కొండ లక్ష్మణ్( ఏ1), సెంట్రింగ్ పనులు చేసే రేగుల శివ(ఏ3) లను అరెస్ట్ చేసి తుంగతుర్తి కోర్టులో హాజరు పరిచామని సీఐ రవికుమార్ వివరించారు. సమావేశంలో ఎస్ఐ ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story

Most Viewed