Android : ఆండ్రాయిడ్‌లో యాపిల్ టీవీ..

by  |
Android : ఆండ్రాయిడ్‌లో యాపిల్ టీవీ..
X

దిశ, ఫీచర్స్ : యాపిల్ టీవీ మొదట్లో ఆ కంపెనీకి సంబంధించిన డివైజెస్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఆ తర్వాత తమ సేవలను అమెజాన్ ఫైర్ ఓఎస్ ఎకోసిస్టమ్‌, ఎల్జీ వెబ్ఓఎస్ వంటి ఇతర పరికరాలకు, ప్లాట్‌ఫామ్‌లకు విస్తరించింది. అయితే యాపిల్ ఉత్పత్తులను ఇండియన్స్ తక్కువగా ఉపయోగిస్తుండగా, ఆండ్రాయిడ్ టీవీ మాత్రం ఇక్కడ పాపులర్ ఆప్షన్‌గా ఉంది. ఆండ్రాయిడ్ ఓఎస్ అనేక బ్రాండ్ల నుంచి స్మార్ట్ టీవీలను కవర్ చేసే ఒక ముఖ్యమైన వేదిక కాగా, దీని ద్వారా యాపిల్ టీవీ యాప్ కూడా ఇప్పుడు ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫామ్‌లోకి విస్తరించడం విశేషం.

నెట్‌ఫ్లిక్స్ నుంచి హాట్‌స్టార్, డిస్కవరీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో వరకు.. ఆండ్రాయిడ్ టీవీ యూజర్లకు సబ్‌స్క్రిప్షన్ రూపంలో బోలెడంత వీడియో కంటెంట్ అందుబాటులో ఉంది. కానీ వీరికి ఇప్పటివరకు ‘యాపిల్ టీవీ’ మాత్రం అందుబాటులో లేదు. కాగా ప్రస్తుతం అన్ని ఆండ్రాయిడ్ టీవీ పరికరాలకు అధికారిక యాక్సెస్ వచ్చేసింది. ఇప్పుడు యాపిల్ టీవీ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సోనీ, షియోమి, రియల్‌మి, టిసిఎల్, వు, వన్‌ప్లస్‌ కంపెనీలకు చెందిన స్మార్ట్ టీవీల్లో యాపిల్ టీవీని యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే యాపిల్ టీవీ + సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే.. యాపిల్స్ ఫేమస్ షోస్ ‘టెడ్ లాస్సో’, ‘ది మార్నింగ్ షో’లను చూడొచ్చు. అయితే యాపిల్ టీవీని ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలో ఇన్‌‌స్టాల్ చేయాలంటే.. కనీసం ఆండ్రాయిడ్ టీవీ 8 ఓరియో లేదా దాని తర్వాత వెర్షన్ అయినా ఉండాలి.

యాపిల్ టీవీ యాప్‌ను ఎలా సెటప్ చేయాలి?

గూగుల్ ప్లే స్టోర్‌లో యాపిల్ టీవీ కోసం సెర్చ్ చేయండి. యాప్ కనిపించగానే డౌన్‌లోడ్ చేసి ‘ఇన్‌స్టాల్’ చేయాలి.
– లాగిన్ ప్రాసెస్ అవసరం లేకుండా యాపిల్ టీవీ ఓపెన్ అవుతుంది.
ఐఫోన్ యూజర్లు ఏదైనా ప్రోగ్రామ్ చూడటానికి లాగిన్ కావాలనుకుంటే..
– సెట్టింగ్స్ పేజీలో అకౌంట్‌పై క్లిక్ చేయండి.
– పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అవ్వడానికి సాధారణ మార్గాలు ఉన్నప్పటికీ, ఐఫోన్ యూజర్లు క్యూఆర్ కోడ్ పద్ధతిని ఎంచుకోవచ్చు. క్యూఆర్ కోడ్ యాప్ ద్వారా కోడ్‌ను స్కాన్ చేసి టచ్‌ ఐడీ లేదా ఫేస్‌ ఐడీ ద్వారా లాగిన్‌ను అథెంటికేట్ చేసుకోవాలి.

Next Story