కుర్చీలతో కొట్టుకున్న న్యాయవాదులు.. ఎక్కడో తెలుసా..?

66

దిశ, వెబ్‎డెస్క్: న్యాయవాదులు కుర్చీలతో కొట్టుకోవడమేంటని అనుకుంటున్నారా.. అది కూడా అక్కడిక్కడ కాదండి ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో కుర్చీలు విరిగే విధంగా కొట్టుకున్నారు. బార్ కౌన్సిల్ ఎన్నికలపై చర్చించేందుకు ఈ సమావేశమైన న్యాయవాదుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో ఉద్రిక్తతలకు దారితీసింది.

ఈ ఘర్షణలో బార్ కౌన్సిల్ సభ్యుడు చలసాని అజయ్ కుమార్ తలకు దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో అజయ్ కుమార్, ఇతర న్యాయవాదులు హైకోర్టు సీజేఐని కలిసేందుకు ప్రయత్నించారు. కాగా, ఈ సమావేశంలో న్యాయవాదులు రాయలసీమ, కోస్తా వర్గాలుగా విడిపోయి పరస్పరం ఘర్షణకు దిగినట్టు సమాచారం. పోలీసుల జోక్యంతో న్యాయవాదులు శాంతించినట్లు తెలుస్తుంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..