గీతం వర్సిటీలో కూల్చివేత.. వైపీపీ కుట్రే

by  |
గీతం వర్సిటీలో కూల్చివేత.. వైపీపీ కుట్రే
X

దిశ, వెబ్‌డెస్క్: గీతం యూనివర్సిటీలో నిర్మాణాలను జీవీఎంసీ శనివారం అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై టీడీజీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాడు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శాస్త్రాలు సంధించారు. ‘ప్రతిష్టాత్మక విద్యాసంస్థపై ఇలా విధ్వంసాలకు పాల్పడటం రాష్ట్ర ప్రగతికి చేటుదాయకం. మొన్న మాజీ మేయర్ సబ్బం హరి ఇంటిపై విధ్వంసం, నేడు గీతం వర్సిటిలో విధ్వంసం వైసీపీ కక్ష సాధింపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం. వ్యక్తులపై, పార్టీపై అక్కసుతో రాజకీయ కక్ష సాధింపు చర్యలను గర్హిస్తున్నాం.’ అని ట్విట్టర్‌లో చంద్రబాబు తెలిపారు. అంతేగాకుండా

‘ఎంతోమంది విద్యార్ధుల చదువులకు, యువత ఉపాధికి, రోగుల వైద్యానికి దోహదపడుతున్న విశాఖలోని అత్యున్నత ‘గీతం’ విద్యాసంస్థల కూల్చివేతలను ఖండిస్తున్నాను. కోర్టులో ఉన్న వివాదంపై, ఎటువంటి ఆదేశాలు రాకముందే యూనివర్సిటీ కట్టడాలను కూల్చేయడం వైసీపీ కక్ష సాధింపు చర్య’ అని ట్విట్టర్ వేదికగా చంద్రబాబు మరో పోట్టు పెట్టారు.

Next Story