- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- రాశిఫలాలు
- ఫోటోలు
- ఆరోగ్యం
బాలీవుడ్ నటి, టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ చేసిన ట్వీట్ క్రికెట్ అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. గతంలో క్రికెట్ గురించి పెద్దగా పట్టించుకోని అనుష్క..కోహ్లీని వివాహం చేసుకున్న తర్వాతే తనకు క్రికెట్ గురించిన ఓనమాలు తెలిశాయని ఓ ఇంటర్వూలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
కాగా, ఈ మధ్య అనుష్క క్రికెట్‌ను విపరీతంగా ఫాలో అవుతోంది. గురువారం భారత మహిళా జట్టు తొలిసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ వార్త తెలిసిన కొద్ది సేపటికే భారత జట్టును అభినందిస్తూ అనుష్క ట్వీట్ చేసింది. హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలో భారత జట్టు అద్భుత విజయాలు సాధిస్తోందని.. తొలిసారి ఫైనల్లోకి అడుగపెట్టి చరిత్ర సృష్టించిన భారత జట్టుకు అభినందనలు తెలిపింది. మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం బాధాకరమే అయినా.. భారత జట్టుకు ఫైనల్లో అడుగుపెట్టే అర్హత ఉందని పేర్కొంది. మార్చి 8న జరగబోయే ఫైనల్స్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు అనుష్క ట్వీట్‌లో వెల్లడించింది.
tags : ICC Women WT20, Ind vs England, Bollywood Actor Anushka, Twitter, Kohli
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.