షాకింగ్: మరో టాలీవుడ్ యంగ్ హీరో డివోర్స్.. షాక్ లో ఫ్యాన్స్..?

754

దిశ, వెబ్‌డెస్క్:సినీ పరిశ్రమలో బంధాలు ఈ మధ్య ఎక్కువకాలం నిలవడంలేదనే చెప్పాలి. ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు విభేదాల వలన కొన్నేళ్లలోనే విడాకులు తీసుకుంటున్నారు. వాటి వలన వార్తలో నిలుస్తున్నారు.  బాలీవుడ్ టు టాలీవుడ్ ఇప్పటి వరకు ఎంతో మంది విడాకుల కారణంగా వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా అక్కినేని వారబ్బాయి నాగ చైతన్య- సమంత విడాకులు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరో టాలీవుడ్ యంగ్ హీరో కూడా విడాకులకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం ఒక బడా వ్యాపారవేత్త కుమార్తెను పెళ్లి చేసుకున్న ఆ హీరో కి, భార్యకు మధ్య విభేదాలు తలెత్తడంతో త్వరలోనే ఈ జంట కూడా విడిపోనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విభేదాలకు కారణం ఎవరు అనేది సస్పెన్స్ గా ఉంది.

ఇకపోతే ఈ యువహీరో ఇటీవల రెండు సినిమాలను సెట్ చేసుకొని షూటింగ్ చేస్తున్నాడు. ఈ  షూటింగ్ లలో కూడా హీరో డిస్టర్బ్ గా ఉండడం వలన అవి కూడా అంతంత మాత్రంగానే నడుస్తున్నాయని టాక్ అంతేకాకుండా ఇంట్లో మనస్పర్ధలు కారణంగా బయట ఈవెంట్ లలోను కనిపించడంలేదట ఈ యంగ్ హీరో. ఇప్పటికే వీరిద్దరి డివోర్స్ ఇష్యూ ఇరు కుటుంబాల మధ్యకు వెళ్లినట్లు సమాచారం. దీంతో యువ హీరో విడాకులపై ఫిల్మ్ ఇండస్ట్రీలో రక రకాలుగా వార్తలు పుట్టుకు రావడం మొదలైంది. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమన్నది తెలియాలంటే సదరు హీరో స్పందించాల్సిందేనని ఇండస్ట్రీ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..