- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అచ్చెన్నాయుడికి రెండోసారి ఆపరేషన్.. చంద్రబాబు పరామర్శ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్ఐ పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారంటూ టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్టుకు రెండు రోజుల ముందే ఆయన పైల్స్ ఆపరేషన్ చేయించుకున్నారు. అరెస్టు నేపథ్యంలో సుదీర్ఘంగా కూర్చుని ప్రయాణించడంతో ఆపరేషన్ గాయం నుంచి బ్లీడింగ్ అయి, ఇన్‌ఫెక్షన్ పెరగడంతో గుంటూరు జీజీహెచ్‌లో ఆయనకు మరోసారి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్ఐ పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారంటూ టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్టుకు రెండు రోజుల ముందే ఆయన పైల్స్ ఆపరేషన్ చేయించుకున్నారు. అరెస్టు నేపథ్యంలో సుదీర్ఘంగా కూర్చుని ప్రయాణించడంతో ఆపరేషన్ గాయం నుంచి బ్లీడింగ్ అయి, ఇన్‌ఫెక్షన్ పెరగడంతో గుంటూరు జీజీహెచ్‌లో ఆయనకు మరోసారి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసి అచ్చెన్నాయుడి ఆరోగ్య తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అటు, అచ్చెన్న అర్ధాంగికి కూడా ఫోన్ చేసి పరామర్శించారు. వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Next Story






